తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై సగౌరవంగా నిలబెట్టి.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన దర్శకధీరుడు.. జక్కన్న.. ఎస్ ఎస్ రాజంౌళి తాజాగా స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే జక్కన్న తాజాగా మాత్రం సూటు బూటులో.. ట్రెండీ హెయిర్ స్టైల్‌తో అదిరిపోయారు. ఇన్నాళ్లూ తెర వెనకే ఉండి కథను నడిపించిన రాజమౌళి.. తొలిసారిగా తెర ముందుకు వచ్చారు. కానీ ఎప్పటిలాగా సినిమాలో అతిథి పాత్ర కోసం కాదు.. ఈసారి ఓ యాడ్ కోసం తెరపై కనిపించారు.
ఇటీవలే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో.. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంది. ఈ క్రమంలో తమ కొత్త ఫొన్ ప్రమోషన్ కోసం జక్కన్నపై ఓ యాడ్‌ను షూట్ చేశారు. అందులో రాజమౌళి ఓ న్యూ లుక్‌లో కనిపించారు. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ఆయన.. ఇందులో మరింత స్టైలిష్‌గా కనిపించడం వల్ల అభిమనులు ఔరా అంటున్నారు. ఈ లుక్‌లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
One Rajamouli is epic enough. But two???
Something spectacular is on its way. #StayTuned@ssrajamouli#OPPOReno10Series#MakeEverySceneSpectacular #OPPO pic.twitter.com/Va0eQ2C9OZ
— Damyant Singh Khanoria (@damyantsingh) June 27, 2023