కేసీఆర్‌ని దించిన బీజేపీ..బీఆర్ఎస్ అందుకేనా?

-

టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తూ…జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్..బీజేపీకి అనుకూలమైన వ్యక్తా? అంటే అబ్బే ఆయన బి‌జే‌పిపై పోరాటం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బి‌జే‌పిపై విమర్శలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆయన బి‌జే‌పి మనిషి ఎందుకు అవుతారని అనుకోవచ్చు. కానీ ఇక్కడే పెద్ద లొసగు ఉందని కాంగ్రెస్ తో సహ పలు జాతీయ విపక్షాలు అంటున్నాయి.

ఎందుకంటే పైకి మాత్రం కే‌సి‌ఆర్ బి‌జే‌పిపై పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు..కానీ ఆయన చేసే రాజకీయం…విపక్షాలని దెబ్బకొట్టే రాజకీయం. విపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడకు వెళ్ళి కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తూ…అక్కడ విపక్షాల ఓట్లు చీల్చి బి‌జే‌పికి లబ్ది చేకూర్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పలు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయన్ని ఇటీవల విపక్షాల భేటీకి కూడా పిలవలేదని అంటున్నారు. మొన్నటివరకు అసదుద్దీన్ ఎం‌ఐ‌ఎం పార్టీ జాతీయ స్థాయిలో విపక్షాల ఓట్లు చీల్చి బి‌జే‌పికి మేలు చేసేది అని, ఇప్పుడు కే‌సి‌ఆర్ ఆ పనిలో ఉన్నారని శివసేనకు చెందిన సామ్నా పత్రికలో కథనం వచ్చింది.

ఇటీవల కే‌సి‌ఆర్ మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ రాజకీయం నడుపుతున్నారు. అక్కడ శివసేన, ఎన్‌సి‌పి, కాంగ్రెస్ లకు చెందిన పలువురు కీలక నాయకులని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొస్తున్నారు. దీంతో శివసేన మండిపడుతుంది.    రైతుల పేరుతో ఓట్లడుగుతూ కేసీఆర్‌ మహారాష్ట్ర రైతులకు భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తులు చేస్తున్నారని,  కానీ, వాస్తవం ఏంటంటే.. ఓట్ల చీలిక ద్వారా ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేస్తుందని, బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని అని శివసేన ధ్వజమెత్తింది.

అంటే కే‌సిఆర్ జాతీయ పార్టీ పెట్టింది..బి‌జే‌పి కోసమని, వి‌పక్షాల ఓట్లు చీల్చి బి‌జే‌పికి మేలు చేయాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్ అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుంది అనేది రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news