ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప- ది రైజ్ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో హిట్ టాక్ సాధించుకుంది. తెలుగు సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా రేంజ్ ని దక్కించుకున్న ఈ మూవీ కలెక్షన్లు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-ది రైజ్ సినిమాపై అన్ని వర్గాల సినీ పరిశ్రమలు ప్రశంసల వర్షం కురిపించాయి. కానీ ఓ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం అందరికి భిన్నంగా కామెంట్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?
డైరెక్టర్ తేజ. టాలీవుడ్ లో ముక్కు సూటిగా.. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంటారు తేజ. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడారు. అందులో పుష్ప సినిమా గురించి రాగానే తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప- ది రైజ్ సినిమా ఫ్లాప్ అని.. చాలా చోట్ల బయ్యర్లు ఆ సినిమాను కొని నష్టపోయారని అన్నారు.
బాలీవుడ్‌లో పుష్ప సినిమా హిట్ అయ్యిందని, అందువల్లనే ఇక్కడ కూడా హిట్ అంటున్నారని తేజ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పుష్ప సినిమాను కొని బయ్యర్లు నష్టపోయారని చెప్పారు. అదే సమయంలో మల్టీప్లెక్స్‌లో జరుగుతున్నది దోపిడీ అంటూ అక్కడి వ్యవస్థను తప్పు పట్టారు తేజ.