ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్ ” యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువ నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకనిర్మాత లక్ష్మీకాంత్, మయూఖా టాకీస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఉత్తేజ్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నట శిక్షణ పూర్తి చేసుకున్న రెండు బ్యాచ్ ల యాక్టింగ్ స్టూడెంట్స్ కు దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.
దర్శకుడు తేజ మాట్లాడుతూ” ఉత్తేజ్ తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. నేను అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన ‘రావుగారిల్లు’ చిత్రానికి తను అసిస్టెంట్గా పనిచేశాడు. అంటే దాదాపు 30 ఏళ్లకు పై నుండి తెలుసు. సినిమారంగంలో తన అనుభవాన్నoతటినీ వినియోగించుకుంటూ ఈ రోజున ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించినoదుకు కంగ్రాట్స్. ఒక నటుడు నటనలో ట్రైనింగ్ తీసుకుంటే అతని నటన, ప్రవర్తన, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటాయో? తీసుకోకపోతే ఎలా ఉంటాయో శివాజీ గణేషన్, కమలహాసన్, రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి వంటి మేటి నటులతో తన అనుభవాలను ఉదహరిస్తూ దర్శకుడు తేజ చెప్పిన సంఘటనలు స్టూడెంట్స్ కు చాలా ఇన్స్‌పైరింగ్ అనిపించాయి.
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ” ఫిలిం ఇనిస్టిట్యూట్లో తాము ఎంచుకున్న శాఖలో ట్రైనింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పటానికి నా కెరీరే ఉదాహరణ. హైదరాబాద్ వచ్చి లక్డికాపూల్ లో ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న తరువాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను తీసుకున్న శిక్షణ నాకు ఎంతో: ఉపయోగపడింది. అలాగే ఉత్తేజ్ గారు ప్రారంభించిన మయూఖ టాకీస్ నటులుగా ఎదగాలనుకుoటున్న మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్ టు మయూఖ టాకీస్..” అన్నారు.
యువ నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ’ భవిష్యత్తులో నేను నిర్మించే చిత్రాలలో మ్మయూఖా టాకీస్ స్టూడెంట్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను”- అన్నారు .