‘కల్కి’లో దిశా పటానీ పాత్ర రివీల్ చేసిన మేకర్స్

-

ప్రపంచవ్యాప్త అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898AD. ఇప్పటి వరకు రివీల్ చేసిన పాత్రలు, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై సూపర్ హైప్​ను క్రియేట్ చేశాయి. రీసెంట్​గా విడుదలైన ట్రైలర్​ హాలీవుడ్​ను తలదన్నేలా ఉంటూ మరింత భారీ హైప్ పెంచింది. జూన్​ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓవర్సీస్​లో ఇప్పటికే బుకింగ్స్​ మొదలైపోయి హాట్​కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

తాజాగా​ కల్కి సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభాస్​ అమితాబ్, దీపికాపదుకొణెల పాత్రలను రివీల్ చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా దిశా పటానీ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్​డే విషెష్ చెబుతూ తన క్యారెక్టర్ పేరు రాక్సీగా పరిచయం చేశారు. ఈ పోస్టర్​లో దిశా గోడకు అననుకొని నడుం అందాలు చూపిస్తూనే మరోవైపు పవర్​ఫుల్​గా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news