అనసూయ నటించిన తొలి చిత్రం తారక్‌ ది అని మీకు తెలుసా?

-

బుల్లితెరపైన యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ వెండితెరపైన కూడా సత్తా చాటుతోంది. టాలీవుడ్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా అనసూయ ప్రస్తుతం ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అనసూయ నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో ‘భీష్మపర్వం’ పిక్చర్ లో నటించింది. ఇటీవల అనసూయ తనను ‘ఆంటీ’ అని పిలవొద్దని కోరుతూ..తనపైన ట్రోల్ చేస్తున్న వారిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ విదితమే.

ఈ సంగతులు అలా పక్కనబెడితే.. అనసూయ భరద్వాజ్ వెండితెరపైన నటించిన తొలి తెలుగు చిత్రం నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆమె అంతకు ముందే వెండితెరకు పరిచయం అయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన ‘నాగ’ చిత్రంలో లా స్టూడెంట్ గా నటించింది.

అప్పట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా తారక్ సినిమాలో కనిపించింది. అయితే, ఆ తర్వాత కాలంలో అనసూయ నటించిన రామ్ చరణ్ -సుకుమార్ ల ‘రంగస్థలం’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ‘రంగమ్మత్త’గా అనసూయకు మంచి పేరు వచ్చింది.

ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన ‘పుష్ప’ పిక్చర్ లోనూ అనసూయ ‘దాక్షాయణి’గా అదరగొట్టింది. ‘పుష్ప-2’లో నూ అనసూయ పాత్ర అదిరిపోతుందని మేకర్స్ చెప్తున్నారు. ఇకపోతే అనసూయ … పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడంతో పాటు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నది. ‘దర్జా’ అనే ఫిల్మ్ లో అనసూయ లీడ్ రోల్ ప్లే చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version