‘ఆర్య’ సినిమాలో బన్నీ క్యారెక్టర్ పేరు ఇదే.. తర్వాత మార్పు ఎలా జరిగిందంటే?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ‘ఆర్య’. ఇందులో బన్నీ యాక్టింగ్ చూసి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. బన్నీకి ఇది రెండో సినిమా కాగా, హీరోగా అల్లు అర్జు్న్ ను నిలబెట్టిన మూవీ ఇది అని చెప్పొచ్చు.

‘గంగోత్రి’ వంటి మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ తర్వాత బన్నీ చేసిన యూత్ ఫుల్ మూవీ ‘ఆర్య’. అయితే, ఈ సినిమ స్టోరిని అప్పటికే చాలా మంది హీరోలకు చెప్పిన దర్శకుడు సుకుమార్.. చివరకు బన్నీతో సినిమా చేశారు.

‘దిల్’ సినిమా ప్రివ్యూ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జు్న్ ను చూసిన దిల్ రాజు, సుకుమార్.. తమ స్టోరి కి బన్నీ సరిపోతాడని అనుకున్నారు.

అలా ‘ఆర్య’ మూవీ స్టోరిని బన్నీకి వినిపించారు. స్టోరి విని అల్లు అర్జున్ ఓకే చేసేశారు. అలా ‘ఆర్య’ మూవీ వచ్చింది. కాగా, ఈ సినిమాలో టైటిల్ రోల్ ‘ఆర్య’ను అల్లు అర్జున్ ను చాలా మంది కొంత కాలం పాటు ‘ఆర్య’ అని పిలిచారు. కాగా, స్టోరి అనుకున్నపుడు బన్నీ పాత్ర పేరు అది కాదండోయ్.

‘నచ్‌కేతా’ అనే పేరుతో బన్నీ క్యారెక్టరైజేషన్ ను రాసుకున్నట్లు సుకుమార్ ఓ సందర్భంలో తెలిపారు. కాగా స్టోరి డిస్కషన్ లో దిల్ రాజు తో చర్చిస్తు్న్న క్రమంలో బన్నీ క్యారెక్టర్ పేరును ‘ఆర్య’గా సుకుమార్ మార్చేశారట.

అలా ఆ సినిమా, పాత్ర బన్నీ కెరీర్ లో నిలబడ్డాయి. ‘ఆర్య’ తర్వాత ‘ఆర్య-2’ సినిమాను బన్నీతో చేసిన సుకుమార్… ఇటీవల ‘పుష్ప’తో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ చేశాడు. ప్రజెంట్ ‘పుష్ప-2’ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version