తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 7/G బృందావన కాలనీ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యింది సోనియా అగర్వాల్. 2004లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా నటించారు. ఈ రవి కృష్ణ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత ఎం ఎం రత్నం కుమారుడు. 7/G బృందావన కాలనీలో సోనియా అగర్వాల్ అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ఎవరి గ్రీన్ చిత్రంగా నిలిచిందని చెప్పవచ్చు.
ఇక విభిన్నమైన ప్రేమ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం తో సోనియా అగర్వాల్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆలా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.7/G బృందావన్ కాలనీ కంటే ముందుగా ఈమె తెలుగులో జగపతిబాబు జోడిగా దమ్ అనే చిత్రంలో నటించినది. ఒక విధంగా చెప్పాలి అంటే తమిళంలో అప్పటికే మంచి పేరు సంపాదించిన తరువాతే ఈమె 7/G బృందావన కాలనీ సినిమాతో ఈమె ఊహించని హైపు తీసుకువచ్చింది.ఆ తర్వాత తమిళంలో బాగానే అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో సక్సెస్ కాలేక పోయింది.
ఇక మలయాళం, కన్నడ వంటి సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది. 2006లో సెల్వ రాఘవన్ వివాహం చేసుకున్న సోనియా అగర్వాల్ ఆ తర్వాత 2010లో విడిపోయారు.ఇక డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఎవరో కాదు హీరో ధనుష్ సోదరుడే వరుసకు సోనియా అగర్వాల్ కూడా ధనుష్ కు వదిన అవుతుంది.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తోంది సోనియా అగర్వాల్. ఇక గతంలో కంటే ఈమె ఇప్పుడు ఎంతో స్లిమ్ గా కనిపిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సోనియా అగర్వాల్ బాగానే అవకాశాలు అందుకుంటోంది. ఈమే ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం హీరోయిన్లను మించిన అందంతో సోనియా మతిపోగోడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.