తెలుగు బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ లలో సుమకు ఎంత గుర్తింపు ఉందో మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజుకు కూడా అంతే గుర్తింపు ఉంది. బుల్లితెర షోలలో పాల్గొంటూ నిర్విరామంగా, బిజీగా గడుపుతున్న ఈయన చేసే ప్రతి షో కూడా భారీ సక్సెస్ ను అందుకుంటుందని చెప్పాలి. తన మాటలతో అల్లరితో షో ని రక్తి కట్టించడమే కాదు ప్రేక్షకులకు కూడా మంచి వినోదాన్ని పంచుతున్నారు. అంతేకాదు పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరొక పక్క సినిమా ఫంక్షన్లను కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇంకొకవైపు “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా ద్వారా హీరోగా చేసి మంచి సక్సెస్ అందుకున్న ప్రదీప్ కొన్ని స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా కూడా నటిస్తున్నారు.
పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న ఈయన ప్రొఫెషనల్ గా మంచి సక్సెస్ లో ఉన్న విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం ఈయన వయసు 37 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం పై అభిమానులు ఎప్పటికప్పుడు పెళ్లి వార్తలను వైరల్ చేస్తూనే ఉన్నారు .ఇప్పటికే ఎన్నో రకాల రూమర్స్ వచ్చినా అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక ప్రదీప్ కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కొట్టి పారేశారు. అయితే ఈసారి బలంగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. ప్రదీప్ గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట.. ఇంట్లో వీరి ప్రేమ గురించి చెప్పడంతో పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ బిజినెస్ బ్యాగ్రౌండ్ సంబంధించిందని , ఆ అమ్మాయి కూడా బిజినెస్ లో బాగా రాణిస్తోందని సమాచారం. ఒక ప్రదీప్ ప్రేమించిన అమ్మాయి.. ప్రదీప్ కుటుంబ సభ్యులకు కూడా చాలా బాగా నచ్చిందట. అందుకే త్వరలోనే ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరపబోతున్నట్లు సమాచారం . ఇక ఇందులో పూర్తి నిజం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.