తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ క కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేని పరిస్థితి ఉంటే ఆ జిల్లా అధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర మొత్తం సెలవులు ఇవ్వలేమని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో కురవవని వివరించింది. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినప్పుడు సిలబస్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, హనుమకొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరిలో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఆయా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవోచ్చని అంచనా వేసింది.