సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం సర్కార్ వారి పాట. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ సరసన హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు ఈ సినిమాకి మంచి హైప్ వచ్చే విధంగా మహేష్ బాబు కూతురు కూడా ఈ సినిమాలో ఒక సాంగ్ లో నటిస్తున్నది. ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా మంచి రెస్పాన్స్ లభించాయి.
ఆ అమ్మాయి పేరు సౌమ్య మీనన్.. ఈమె హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా ఒక కన్నడ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నది. వీటితో పాటు మళయాళ చిత్రాలలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈమె టాలెంట్ ను చూసి చిత్ర బృందం ఈమెకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో సౌమ్య మీనన్ నటించినట్లుగా మనకు కనిపిస్తోంది. ఇక ఈమె ఒక డ్యాన్సర్‌గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఈ ముద్దుగుమ్మ కు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి.