Ram Charan: ఉపాసనను తలుచుకుంటున్న రామ్ చరణ్..త్రో బ్యాక్ పిక్స్ షేర్

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిరుత’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటించిన సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

RRR సినిమాలో రామ్ చరణ్ మరోసారి తన నట విశ్వరూపం చూపారు. ఇక తండ్రితో కలిసి ‘ఆచార్య’ పిక్చర్ లో నటించారు. ‘సిద్ధ’ పాత్రకు సంపూర్ణ న్యాయం చేసి..ప్రేక్షకుల మెప్పు పొందాడు. రామ్ చరణ్ ప్రజెంట్ RC15 షూటింగ్ లో ఉన్నాడు. ఏపీలోని వైజాగ్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ తాజాగా సోషల్ మీడియా లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘హాలిడే మై మైండ్ టూ ఉపాసన’’ అంటూ తన భార్య ఉపాసన గురించి ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేశాడు మెగా పవర్ స్టార్. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘హాండ్సమ్, సో క్యూట్’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

RC15 షూటింగ్ పూర్తయిన తర్వాత తన భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లాలని రామ్ చరణ్ కు సూచిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 ఫిల్మ్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version