హీరో రాజశేఖర్ కి, శ్రీలీల కు మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా..?

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అప్పటి అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చారు.. మరొకవైపు టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పరిచయమై స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తున్న శ్రీ లీలాకు. హీరో రాజశేఖర్ కు మధ్య చిన్న సంబంధం ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

రాజశేఖర్ కేవలం నటుడు మాత్రమే కాదు డాక్టర్ కూడా.. శ్రీలీలా కూడా ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది. ఈమె తల్లి కూడా ప్రముఖ డాక్టర్.. అదే బాటలో ఈ ఏడాది ఈమె డాక్టర్ పట్టా పుచ్చుకోబోతోంది. వీళ్ల బాటలో డాక్టర్ తోపాటు యాక్టర్ అయినా నటీనటుల విషయానికి వస్తే.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాము అంటారు కానీ డాక్టర్ అయ్యి కూడా యాక్టర్ అయ్యారు కొంతమంది. అలాంటి వారిలో రాజశేఖర్ ,శ్రీ లీల కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ కూడా డాక్టర్లు అయ్యి యాక్టర్లు అయ్యారు. వీరితోపాటు అల్లు రామలింగయ్య హోమియోపతి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకోగా ..సాయి పల్లవి గుండె సంబంధిత వైద్య నిపుణులుగా గుర్తింపు తెచ్చుకుంది. రూపా కొడివయూర్ కూడా డాక్టర్ మాత్రమే కాదు సాయి పల్లవి లాగా మంచి డాన్సర్ కూడా వీరితోపాటు మరింతమంది ఒకపక్క డాక్టర్లు అయ్యి మరోపక్క ఇండస్ట్రీకి వచ్చే యాక్టర్లుగా మారారు.

Read more RELATED
Recommended to you

Latest news