సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం : భట్టి విక్రమార్క

-

కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించారు. సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలు పాటిస్తామని చెప్పారు.

న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయం తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామని వెల్లడించారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్‌ కమిషనర్‌, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీని ఆదేశించామని భట్టి చెప్పారు.

మరోవైపు ఇదే వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని.. న్యాయం గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news