టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

-

ప్రస్తుత కాలంలో ఈ స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగానే ఉన్నారు. కొత్త హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొని ఉండడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు అతి తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. ఇకపోతే ఈ స్టార్ హీరోయిన్ల టాప్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వారి పారితోషకం ఎంతో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

- Advertisement -

1. నయనతార:
సౌత్ సినీ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్న ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

2. పూజా హెగ్డే:
పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె ఇప్పుడు అవకాశాలు లేక కాస్త సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రూ .4కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

3. రష్మిక మందన్న:
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న తెలుగు, తమిళం, హిందీలో కూడా నటిస్తూ ఒక్కో సినిమాకు సుమారుగా రూ .4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది.

4. సమంత రుతుప్రభ:
తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈమె జోరు మరింత పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న ఈమె సుమారుగా రూ .7కోట్ల వరకు పారిపోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

5. కాజల్ అగర్వాల్:
పెళ్లయిన తర్వాత కూడా జోరు తగ్గని కాజల్ అగర్వాల్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...