విజయ్ దేవరకొండ ‘లైగర్’ స్టోరి లైన్ ఇదేనా..పూరీ జగన్నాథ్ మార్క్ ?

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ప్లస్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’. ఈ చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిక్చర్ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డాడు.

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే ఇందులో హీరోయిన్ కాగా, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి. ఈ మూవీ కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో ‘లైగర్’కు సంబంధించిన వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వార్త ప్రకారం..‘లైగర్’ ఫిల్మ్ స్టోరి ఇదేననే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతున్నది. స్టోరి కంప్లీట్ గా మైక్ టైసన్ పైనే కాన్సంట్రేట్ అయి ఉంటుందట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మైక్ టైసర్ ను అభిమానించే బాక్సార్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. కనీసం గా ఒక్కసారైనా మైక్ టైసన్ తో సెల్ఫీ దిగాలని అనుకుంటాడట.

అది అతని డ్రీమ్ కాగా ఊహించని ట్విస్టులు వచ్చి మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ తలపడే సందర్భం వస్తుందట. ఆ ఫైట్ లో మైక్ టైసన్ కన్నుమూయగా, అతనని తన ఒడిలో పడుకోబెట్టుకుని విజయ్ దేవరకొండ సెల్ఫీ దిగుతాడట. అప్పుడు విజయ్ దేవరకొండ బాగా ఎమోషనల్ అవుతాడట…ఇది పిక్చర్ స్టోరి అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. అయితే, ఈ స్టోరి అంతా ఉట్టిదేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ మార్క్ స్టోరి లైన్ ప్లస్ ఫైట్ సీక్వెన్సెస్ ‘లైగర్’లో ఉంటాయని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version