తెలుగు సినిమా గొప్పదనాన్ని ఎల్లలు దాటించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వచ్చినా.. ఎన్ని కుటుంబాలు ఉన్నా సరే పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్, నంది అవార్డులు తీసుకొచ్చినా సరే ఆయన గుర్తింపు చెదిరిపోదనే చెప్పాలి. అంతటి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మహనీయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన ఆఖరి రోజుల్లో చేసిన పనులు, ఆయన పడిన బాధలకు సంబంధించిన విషయాలను ఆయన అభిమానులు మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ మరికొన్ని గంటల్లో చనిపోతానని తెలిసినప్పుడు.. చివరిగా తన ప్రాణ స్నేహితుడు ,శ్రేయోభిలాషి అయిన అక్కినేని నాగేశ్వరరావుకు ఫోన్ చేశారట. నీతో మాట్లాడాలని ఉంది.. నీతో కలిసి భోజనం చేయాలని ఉంది.. ఇంటికి రా అంటూ ఫోన్ చేశారట. అయితే నాగేశ్వరరావు కూడా వస్తున్నానంటూ చెప్పి ఫోన్ కట్ చేశారు. అలా కొద్ది నిమిషాలకే ఎన్టీఆర్ మరణించారట. ఇక ఆ మరణ వార్త అక్కినేని నాగేశ్వరరావు వరకు చేరింది. వస్తానన్న కొద్ది క్షణాల్లోనే ఆయన మరణించడంతో ఈ విషయం తెలిసి పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యారట నాగేశ్వరరావు. ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ గా మారింది.
వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయికి రావడానికి కారణం కూడా వీరిద్దరే. అయితే ఈ విషయాన్ని ఎవరైనా సరే కచ్చితంగా ఒప్పుకోవాలి మరి.. కానీ కొంతమంది వీరి బంధాన్ని విడగొట్టడానికి ఇద్దరి మధ్య చిచ్చులు కూడా పెట్టారట. ఈ క్రమంలోనే ఆఖరి రోజుల్లో వారు మాట్లాడుకోలేదు. కానీ చివరిగా ఎన్టీఆర్ మాత్రం తన ప్రాణ స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ ఫోన్ చేసి తన కోరికను వెల్లడించారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఎన్టీఆర్ గారు స్వర్గస్తులయ్యారు.