కులగణనపై రెండుసార్లు ప్రధాని మోదీని కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరూ కులగణన చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 54% బీసీలు ఉన్నామని.. తమకు ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని కోరామన్నారు.
తమ అభ్యర్థనను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు వీహెచ్. శుక్రవారం పీసీసీని, భట్టి, మధుయాష్కి లను కలిశానని.. సెప్టెంబర్ 6 న సభ పెట్టేందుకు సమయం తీసుకున్నామన్నారు. ఈ సభకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ బీసీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు వి.హెచ్. కాంగ్రెస్ ని చూసి మిగిలిన పార్టీలు కూడా బీసీల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు.