తనీష్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

-

ప్రముఖ యంగ్ హీరో తనీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇదిలాఉండగా సుమారుగా దశాబ్ద కాలం క్రితం తనిష్ హీరోగా వచ్చిన “మేం వయసుకు వచ్చాం” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రవితేజ ధమాకా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రినాధ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వేరువేరు కులాలకు సంబంధించిన అమ్మాయి,అబ్బాయిలు ప్రేమలో పడడం.. పెద్దల కోసం తమ ప్రేమను త్యాగం చేయడం వంటి మంచి యూత్ ఫుల్ అంశంతో తెరకెక్కింది ఈ సినిమా.

ఇకపోతే ఇందులో హీరోయిన్ గా నటించిన నీతి టేలర్ దిల్ రూబా అలియాస్ దిల్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయింది. అందంతోపాటు అభినయంతో కుర్ర కారును తన వశం చేసుకుంది. ఇక తర్వాత రాహుల్ రవీంద్రన్ తో కలిసి పెళ్లి పుస్తకం అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో లవ్ డాట్ కామ్ అనే సినిమాలో కూడా నటించింది. ఇక తర్వాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మిమ్మల్ని ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక చాలాకాలం తర్వాత తాను ప్రేమించిన వ్యక్తిని నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఇకపోతే సినిమాలలో బిజీగా ఉండగానే పరీక్షిత్ బవా అనే వ్యక్తితో ప్రేమలో పడి 2019లో అతనితో నిశ్చితార్థం చేసుకొని మరుసటి ఏడాదే పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక బాలీవుడ్ బుల్లితెరపై మళ్ళీ దర్శనమిచ్చిన ఈమె అక్కడ పలు డాన్స్ రియాల్టీ షోలు, వెబ్ షో లు చేస్తూ బిజీగా గడుపుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా కొనసాగుతోంది. ఇకపోతే ఈమె అందంలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nititaybawa (@nititaylor)

Read more RELATED
Recommended to you

Latest news