ఆంధ్రప్రదేశ్ లో పశువులకు గోదార్ కార్డులు ఇవ్వనున్నారు.పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ కంక్లేవ్ లో స్టార్ట్ అప్ కంపెనీలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మనుషులకు ఆధార్ తరహా లోనే పశువులకు గోదార్ కార్డులు కూడా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్చలు జరిపారు.

పైలాట్ ప్రాజెక్టుగా ముందుగా తిరుపతి జిల్లాలోని పశువులకు గోదార్ అనుసంధానం చేయాలన్నారు. అలాగే కోళ్లకు వచ్చే వ్యాధులకు గుర్తింపు. ఆరోగ్య విషయాల పై ప్రత్యేక యాప్ రూపొందించాలన్నారు. ఈ కార్డు ద్వారా చాలా జంతువులకు ఉపయోగపడుతుంది. మానవునికి ఆధార్ కార్డ్ ఎలానో జంతువులకు కూడా ఈ కార్డు అలా ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని పశువులు జంతువులు ఉన్నాయో తెలుస్తుంది. ఈ కార్డులు జారీ చేయడానికి పశు సంవర్ధక శాఖకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఆదేశించింది.