మహేష్ స్పైడర్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కథల ఎంపిక విషయంలో కమర్షియల్ గా హిట్ అయ్యేటట్టుగా పాత్రలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన కెరియర్ లో వచ్చిన స్పైడర్ సినిమా గురించి ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని విలన్ ని కూడా అంత త్వరగా మర్చిపోలేమనే చెప్పాలి. ముఖ్యంగా మురగదాస్ తెరకెక్కించే ప్రతి సినిమా కూడా ఒక ప్రయోగాత్మకంగా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అలా చేసిన సినిమాలలో స్పైడర్ కూడా ఒకటి. హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటించగా.. హీరోకి తగ్గట్టే విలన్ పాత్రను కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు మురగదాస్.

అయితే ఈ విలన్ పాత్రలో ఎస్. జె. సూర్య తన నటనతో పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ లో చిన్నప్పటి రోల్ లో ఒక కుర్రాడు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కుర్రాడు కూడా తన నటనతో అందరిని ఇట్టే ఆకట్టుకున్నాడు. స్పైడర్ మూవీ అనగానే ఆ కుర్రాడే టక్కున గుర్తొచ్చేస్తాడు. ఇకపోతే అప్పుడు ప్రేక్షకులను ఆ రేంజ్ లో అలరించిన ఈ కుర్రాడు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.

అబ్బాయి పేరు సంజయ్.. చెన్నైలో జన్మించిన ఇతడు డాన్స్, సినీ యాక్టివిటీస్ , వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి బాగానే సంపాదిస్తున్నారు. ఇలా ఫేమస్ అయిన సంజయ్ టాలెంట్ ని చూసి మురగదాస్ స్పైడర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక సినిమాలో అవకాశం రావడంతో తానేంటో నిరూపించుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక తర్వాత జాక్పాట్, మూగముని , గజినీకాంత్, దర్బార్ వంటి సినిమాలలో నటించిన సంజయ్ ఇప్పుడు మరింత స్మార్ట్ గా మారారు. ప్రస్తుతం చదువుల కోసం బ్రేక్ తీసుకున్న ఇతడు త్వరలోనే హీరో అవుతాడని పలువురు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news