పొంగ‌ల్ ప్రోగ్ర‌స్ : హీరో క‌థ‌కు అంత సీన్ ఉందా?

-

ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం అమ‌ర్ రాజా కంపెనీ మ‌రో అడుగు ముందుకు వేసింది. చిత్ర నిర్మాణానికి సై అంది.తొలి సినిమాతో ఆ సంస్థ మంచి బోణీ కొట్ట‌నుంద‌ని ఇండస్ట్రీ నుంచి ఎంద‌రెంద‌రో  ఆశిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉండేవారంతా ఇవాళ ఈ సినిమా ఫ‌లితంపై బాగా దృష్టి సారించారు.అదేవిధంగా మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు మంచి మ‌ద్ద‌తు ఇచ్చి కుర్ర హీరో ను ఆశీర్వ‌దించేందుకు తాము సిద్ధం అని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ సంక్రాంతి కోడి పుంజు గ‌ల్లా అశోక్ బ‌రిలో ఉన్నాడు.హిట్ కొట్టాల్సిందే! హీరో నాగ్ తో ఢీ అనాల్సిందే!

- Advertisement -

రేసు భ‌లే.. భ‌లే మంచి రోజేనా!

హీరో సినిమాతో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ నిర్మాత‌గా మారారు.త‌న అదృష్టాన్ని కొడుకుతో ప‌రీక్షించుకోనున్నారు. ఈ సినిమా విడుద‌ల అయ్యేందుకు అన్ని ప‌నులూ పూర్తి చేసుకుని సిద్ధం అవుతోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించి ఆదిత్య శ్రీ‌రామ్ (ద‌ర్శ‌కులు) మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి అందాల తార నిధి అగ‌ర్వాల్ ఓ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. అదేవిధంగా నిన్న‌టి ప్రీరిలీజ్ లో హీరో రానా సంద‌డి చేసి కుర్ర హీరో అశోక్ లో జోష్ నింపారు.

ఇంకా చెప్పాలంటే… ఇంకేం కుదిరాయంటే…

అంద‌రూ అనుకున్న విధంగానే సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మ‌రో న‌ట వార‌సుడు వ‌స్తున్నాడు. ఈ సంక్రాంతి బ‌రిలో నాగార్జున‌నే ఢీ కొంటున్నాడు. న‌ట‌శేఖ‌ర కృష్ణ మ‌న‌వ‌డు గ‌ల్లా అశోక్ హీరో గా రానున్నాడు.. హీరో సినిమా రానున్నాడు. రావ‌డం రావ‌డంతోనే సంద‌డి చేస్తున్నాడు. తమ సొంత బ్యాన‌ర్ అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై రానున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ప‌తాక శీర్షిక‌ల్లో నిల‌వ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప్రచారం బాగానే చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ బ‌జ్ తెచ్చేందుకు యూనిట్ చేస్తున్న కృషి కార‌ణంగా రిజ‌ల్ట్ అనుకున్న‌దానికంటే ఎక్కువ‌గానే వ‌స్తోంది అని మీడియా స‌ర్కిల్స్ అంటున్నాయి. నిన్న‌టివేళ హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక‌లు నిర్వ‌హించారు. హీరో తండ్రి గ‌ల్లా జ‌య‌దేవ్, త‌ల్లి గ‌ల్లా ప‌ద్మావ‌తి తో స‌హా ఇత‌ర చిత్ర బృందం అంతా సంద‌డి చేశారు. వేడుక‌లకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాఘ‌వేంద్ర‌రావు ఆత్మీయ వాక్యాల‌తో చిత్ర బృందంలో ఆనందం నింపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...