దేవదాస్ ఎడిటింగ్ జర్కులు గమనించారా..!

-

శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన దేవదాస్ సినిమా మల్టీస్టారర్ సినిమా కాబట్టి ఆడేస్తుంది. నాగ్, నానిల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూసేస్తున్నారు. ఇద్దరి పాత్రల స్వభావం ఇంకా దర్శకుడు సినిమాను కామెడీగా నడిపించిన విధానం నచ్చి దేవదాస్ సూపర్ అనేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలా చోట్ల ఎడిటింగ్ జర్కులు ఉన్నాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా నాగార్జున ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించడం దర్శకుడు మర్చిపోయాడా లేక ఎడిటింగ్ లో కట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక సినిమాలో ఇద్దరు హీరోలు కాబట్టి నాని వచ్చి కొన్ని మార్పులు చెప్పడం.. మళ్లీ నాగార్జున వచ్చి చూసి మరికొన్ని మార్పులు చేయడం ఇలా సగం ఎడిటింగ్ పని ఈ ఇద్దరు హీరోనే చేసుకున్నారట.

అందుకే అక్కడక్కడ కొన్ని సీన్స్ జంప్ అవడం.. జర్క్ అనిపించడం జరిగింది. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక అది మల్టీస్టారర్ సినిమా అయినా దర్శకుడి మీద నమ్మకం ఉంచాల్సిందే. మరి నాగ్, నానిల దేవదాస్ టాక్ బాగుండటంతో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనిపించుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news