కేసు కోర్టులో ఉన్నప్పుడు.. ప్రెస్ మీట్ పెట్టవద్దని అడ్వైజర్లు చెప్పలేదా : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

-

పరోక్షంగా అయిన పత్యేక్షంగా నో మన వల్ల తప్పిదం జరిగినప్పుడు.. మానవత్వంతో అదుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలి అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సంధ్య ధియేటర్ వద్ద జరిగిన ఘటన పబ్లిసిటీ కోసం వడుకుంటుంటే.. బాధ వేస్తుంది. రేవతి చనిపోయారు.. ఆమె కొడుకు శ్రీతేజ్ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టడుతున్నారు. సినిమా చూసేందుకు వచ్చిన హీరో ఎవరికి కనబడకుండా.. పబ్లిసిటీ లేకుండా వెళితే అయిపోయేది. అభిమానం చూపుతున్నారని విచ్చల విడిగా రెచ్చిపోయి.. రోడ్ షో చేయడం.. తో తొక్కిసలాట జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.. అందుకే చేతులు ఊపము అంటున్నారు. తప్పును సమర్ధించుకోకుండా.. సరిదిద్దుకుంటే.. ఎవరైనా హర్షిస్తారు.

కానీ ఈ ఘటనకు కారణమైన హీరో… ప్రభుత్వం నా పైన తప్పుడు ప్రచారం చేస్తుంది.. అని మళ్ళీ హీరో ఇజం చూపే ప్రయత్నం చేశారు. హీరో ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. పోలీసులు వెళ్ళిపొమ్మనారు అని హీరోనే చెబుతున్నాడు. వెళ్ళిపోయే సమయంలో కూడా రోడ్ షో చేసి.. హీరో ఇజం ప్రదర్శించారు. రేవతి చనిపోయిన తర్వాత కూడా కుటుంబాన్ని 11 రోజులు అయిన కనీసం పరామర్శించలేదు. రేవతి చనిపోయింది అని తెలిసిన తర్వాత ఎందుకు పరమర్శించలేదు.లీగల్ అడ్వైజ్ ఇచ్చిన వారు.. కోర్టు లో పరిధిలో కేసు ఉన్నప్పుడు.. ప్రెస్ మీట్ పెట్టవద్దని అడ్వైజర్లు చెప్పలేదా.. ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని తప్పు పడుతున్నారు. ఘటన జరిగిందని ఎటువంటి ఆవేదన మీ హావభావాల్లో ఎక్కడ కనిపించలేదు. అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు. ప్రెస్ మీట్ లో ఉపయోగించిన పదాలు చాలా అభ్యంతరకరం.. అవి కరెక్ట్ కాదు అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news