అంతా అయిపోయింది అనిపించింది.. ఎమోషనల్ అవుతున్న సమంత..!

-

ఇటీవల సమంత మయోసిటీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితం ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరూ షాక్కు గురయ్యారు ఎంతోమంది బడా హీరోలు సైతం ఈమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీన విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా సమంత సుమాతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మరొకసారి తెలియజేసింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి పోస్టులో పెట్టిన విధంగానే కొన్ని రోజుల మంచి రోజులనేవి కొన్ని రోజులు చెడ్డ రోజులు అనేవి వస్తూ ఉంటాయని తెలిపింది. ఒక్కొక్క రోజు తాను ఒక్క అడుగు ముందుకు వేయలేనని. అలా వేస్తే ఇక అంత అయిపోయింది అనిపిస్తుందని , ఆ తర్వాత కొన్ని రోజులకు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని దాటి వచ్చానా అనిపించింది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది సమంత. ఇక సుమ కూడా మీరంటే నాకు చాలా ఇష్టం. నేను గత కొన్నేళ్లుగా మన ప్రయాణంలో చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు అంటే బయటికి వచ్చారు. బయటికి చొప్పని సమయంలో కూడా మీరు మీ వ్యాధితో పోరాడుతూ చాలా నొప్పిని అనుభవించారు నాకు తెలుసు అంటూ సుమ తెలియజేసింది.

అయితే తమ ఆరోగ్యం పై సమంత మాట్లాడుతూ.. నేను ఎన్నో ఆర్టికల్లో చూశానని తెలియజేస్తుంది. ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నామని రాశారు కానీ ప్రస్తుతానికి నాకు నేను ఉన్న స్టేజిలో ఇది ప్రాణాంతకమైనది కాదు నేను ఇంకా చావలేదు అంటూ నవ్వేసింది సమంత. ప్రస్తుతం సమంతకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version