సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూశారు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా. నగరి లో కుటుంబసమేతంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూశారు మాజీ మంత్రి రోజా. ఇక ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా థియేటర్ వీడియో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా.. హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా చేశారు. ఇక ఈ సినిమా ఇవాళ రిలీజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రాజు పాత్రలో వెంకటేష్ చించేశాడు. భార్యని తాను ఎంత గా ప్రేమిస్తున్నానో చెప్తూనే కిడ్నాప్ కేసుని సాల్వ్ చేస్తాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించలేదు..జీవించేసింది. అంతేకాదు తన భర్త ఎక్కడ మాజీ ప్రియురాలి ప్రేమలో పడిపోతాడో అన్న భయంతో ఐశ్వర్యరాజేష్ చూపించే అతి ప్రేమ.. వినయం ..అనుమానం అన్నీ కూడా తెర పై బాగా వర్కౌట్ అయ్యాయి.