పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఊపీరిపీల్చుకున్న ప్రయాణికులు

-

సంక్రాంతి పండుగ సమయంలో తమిళనాడులో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం విల్లుపురం రైల్వే‌స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం అనంతరం ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు.

ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు పంపించినట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు. కాగా, ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ సైతం చేపట్టారు. ఇంజినీర్లతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను క్లియర్ చేసి ఇతర రైళ్లకు మార్గం సుగమం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news