సోహెల్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఫస్ట్ బ్రేకప్ గురించి చెప్పిన హన్సిక..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది హన్సిక.. అయితే ఆ తర్వాత కాలంలో కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసిన హన్సికకు అవకాశాలు పెద్దగా రాలేదు. దానికి తోడు హీరో శింబు తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు కూడా వచ్చాయి అయితే వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. క్రమంగా ఈమెకు అవకాశాలు తగ్గుతున్న క్రమంలో వెండితెరను వీడి ఓటీటీ లో కూడా చేసింది. ఇటీవల పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది హన్సిక.. ఇదిలా ఉండగా గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన తన స్నేహితుడు సోహెల్ కతూరియా ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోని డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ లో వీరి పరిచయం, ప్రేమ, వివాహం గురించి లవ్ షాది డ్రామా పేరిట సీరియస్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలోని ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక తన మొదటి బ్రేకప్ గురించి అలాగే తన భర్త సోహెల్ పై తనకున్న ప్రేమ గురించి వ్యక్తపరిచింది. హన్సిక మాట్లాడుతూ..” ఒకరి ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది బ్రేకప్ తర్వాత కోలుకొని కొత్త వ్యక్తి ప్రేమను అంగీకరించడానికి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది . నాకు ప్రేమ పై నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ వ్యక్తిని కానీ రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్స్ ప్రెస్ కాదు.. మనసులోని భావాలను త్వరగా బయట పెట్టలేను ప్రేమను విశ్వసిస్తాను..

వివాహ వ్యవస్థను నమ్ముతాను .. నిజం చెప్పాలంటే నాతో భవిష్యత్తులో ఉండబోయే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం పట్టింది. సోహెల్ ప్రేమను నేను ఎక్కువగా నమ్ముతాను. అతను నా ప్రేమ కోసం ఎదురు చూశారు. దేవుడు మాకు కొత్త దారి చూపించాడు.మొదటి బంధం ముగిసిపోయింది. అందుకు ఇప్పుడు మరో కొత్త బంధం ప్రారంభమైంది” అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.

Read more RELATED
Recommended to you

Exit mobile version