టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ఎన్ని సినిమా అవకాశాలు తెచ్చి పెట్టిందో మనము చూశాము. కానీ ఆ సినిమాలు అన్నీ చాలా వరకు సక్సెస్ అవ్వడంలో ఫెయిల్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఈ మధ్యన వచ్చిన ఖుషి మూవీ సైతం యావరేజ్ మూవీ గా నిలిచిపోయింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను గీతగోవిందం రూపంలో అందించిన డైరెక్టర్ పరుశురాం తో మళ్ళీ జతకట్టి ఒక మంచి ఫామిలీ స్టోరీని అందించడానికి సిద్దమయ్యాడు విజయ్ దేవరకొండ. పరుశురాం, విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ను ఫైనల్ చేశారు.
అయితే, విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు సమాచారం. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నాటికి షూటింగ్ పూర్తి కానుందని టాక్. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.