Faria Abdullah : బంప‌ర్ ఆఫర్ కొట్టేసిన “చిట్టి”.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌లో ఛాన్స్‌..!

-

Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ అందుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అంత‌కుముందు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ న‌టించిన ఈ అమ్మ‌డు ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ మారింది. చిట్టి చిట్టి పాటతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ సినిమాలో తన నటన, కామెడీ టైమింగ్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది ఫరియా. ఈ చిత్రం సక్సెస్ కావ‌డంతో.. వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. అనుకున్న‌స్థాయిలో అవకాశాలు రాలేదు. మొన్నటికి మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అలా మెరిసి..ఇలా వెళ్లిపోయింది. అది పూర్తి స్థాయి పాత్ర కాదు. ఈ క్ర‌మంలో ఫరియాకి మంచి ఛాన్స్ వచ్చిన‌ట్టు స‌మాచారం. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో 2007 వచ్చిన ఢీ సినిమా ఎలాంటి హిట్ అయిందో అంద‌రికీ తెలుసు. ఇటు శ్రీ‌ను వైట్ల కెరీర్ లోగాని, అటు మంచు విష్ణు కాంబినేష‌న్ లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఎప్ప‌టి నుండో ఈ సినిమాకు సీకెవల్ తీయాల‌ని వార్తలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్‌ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

శ్రీను వైట్ల డైరెక్ట‌ర్ గా తెర‌కెక్కెతున్న ఈ చిత్రంలో మంచు విష్ణుకు జంట‌గా.. ‘జాతి రత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ను ఎంపిక చేసినట్టు మూవీ యూనిట్ వెల్ల‌డించింది. మా అధ్య‌క్షుడైనా త‌రువాత న‌టిస్తున్న చిత్రం కాబ‌ట్టి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..!! వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news