ఉచిత రేషన్ పై యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

పేదలకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉచిత రేషన్ పై యూపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం రేషన్ ద్వారా ఇచ్చే సరుకుల్ని మరి కొన్ని నెలలు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేంద్రం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఇచ్చే సరుకుల్ని నవంబర్ 15 తర్వాత నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ఉచిత రేషన్ విధానాన్ని మార్చి హోలీ వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఆహార ధాన్యంతో పాటు వంటనూనె, ఉప్పు ప్యాకెట్లను రేషన్ విధానంలో అందచేయనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కరోనా ఫస్ట్ వేవ్ లో దాాదాపు 128 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉచిత రేషన్ విధానంలో అందించింది. రాష్ట్రంలోని 15 కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఇవ్వనున్నారు.  ఉత్తర్ ప్రదేశ్ సర్కారు నిర్ణయంతో ఆ రాష్ట్ర పేదలకు మరింత లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ విధానాన్ని మరికొన్ని నెలలకు పెంచింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం మరికొంత కాలం ఉచిత రేషన్ ను అందించాలని కోరతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news