రాజీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్.. ఆనందంలో స‌మంత ఫ్యాన్స్

-

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుద‌ల అయిన ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 లో టాలీవుడ్ స్టార్ హీరోయిన‌ స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో స‌మంత రాజీ అనే పాత్ర లో న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంసలు అందుకుంది. తాజా గా రాజీ పాత్ర చేసిన స‌మంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఫేర్ ప్ర‌తినిధులు అధికారిం గా ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు.

ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ -2 కు సంబంధించి ఓటీటీ లో ది బెస్ట్ ఫీమెల్ న‌టుల జాబితా లో స‌మంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కింది. అయితే ఫిల్మ్ ఫేర్ ట్విట్ కు స‌మంత థాంక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది. అయితే స‌మంత ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 లో రాజీ పాత్ర లో న‌టించిన స‌మంత ప్ర‌శంస‌లు అందుకుంది. ఇది ఇలా ఉండ‌గా ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 వెబ్ స‌రీస్ ను ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ కు సీక్వ‌ల్ గా తెర‌కెక్కించారు. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news