ఇవాళ సాయంత్రం బిపిన్ రావత్ అంత్యక్రియలు

-

ఇవాళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఉదయం 11 నుంచి 12:30 వరకు సాధారణ ప్రజానికం నివాళులు అర్పించేందుకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. ఆ తర్వాత త్రివిధ దళాలకు చెందిన అధికారులు ,సిబ్బంది నివాళులు అర్పించానున్నారు. 2 గంటల సమయంలో కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర ఉండనుంది.

ఆ తర్వాత అంత్యక్రియలు జరుగనున్నాయి. 2 గంటల సమయంలో కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర జరుగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు పూర్తిస్థాయి మిలిటరీ వందనాలతో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు 14 మంది ప్రయాణిస్తున్న MI-15V5 ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలడంతో సీడీఎస్ తో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news