లైంగిక వేధింపులకు కేసులో ముందస్తు బెయిల్ కోరిన నిర్మాత…!

22 ఏళ్ల మహిళకు సినిమాలలో తనకు అవకాశం ఇస్తానని చెప్పి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చిత్ర నిర్మాత ఆల్విన్ ఆంటోని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇది వరకు ఆవిడపై గత ఏడాది నాలుగు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.

alwin antony
alwin antony

అయితే ఈ కేసుకు సంబంధించి చిత్ర నిర్మాత ముందస్తు బెయిల్ కోరుతూ.. ఈ కేసు నిరాధారమని ఆయన తెలిపారు. చిత్ర నిర్మాత ఆ మహిళల గురించి మాట్లాడుతూ… చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తుల గురించి పుకార్లు, అలాగే ఫోటోలను పంపడం చేసిందని తెలిపాడు. అంతేకాకుండా ఆమెకు నేరపూరిత వ్యక్తిత్వం తెలవడంతో తాను ఆమెతో అన్ని రకాల సంబంధాలను నిలిపివేసినట్లు తెలియజేశాడు. అయితే సినిమాలలో పాత్రల కోసం ఆమె తనని ఇబ్బంది పెడుతూనే ఉందని, ఆ బాధ భరించలేక తాను ఆమె ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశానని తెలిపాడు. దీనితో సదరు మహిళ మరియు ఆవిడ తల్లి తన పేరును నాశనం చేస్తామని బెదిరించారని తెలిపాడు.