మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు బెదిరింపు ఫోన్​కాల్​…!

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్​కు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. గత నెల 25న తనను చంపుతానంటూ ఇంటర్నెట్ వాయిస్ కాల్ నుంచి ఆగంతుకుడు ఫోన్ చేశారని కె.నాగేశ్వర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దూషించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్లు అందుబాటులోకి రాలేదని… చివరికి హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

nageswar
nageswar

12 రోజులైనా తన ఫిర్యాదుపై ఎలాంటి పురోగతి లేదని, మాజీ ఎమ్మెల్సీగా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యుల సంగతేంటని నాగేశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తానని కె. నాగేశ్వర్ స్పష్టం చేశారు. నాగేశ్వర్ కి సొంతగా ఓ యూ ట్యూబ్ చానెల్ ఉంది. అందులో ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల గురించి, రాజకీయ పార్టీలు గురుంచి విశ్లేషణలు చేస్తారు.