ఆఖరికి సుమా కూడా దిగజారి పోతోందా..?

-

బుల్లితెరపైన ప్రసారమయ్యే కార్యక్రమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రోమోలు చూసినటువంటి ప్రేక్షకుల నిజంగానే ఇందులో కొంతమంది గొడవపడ్డారా లేకపోతే ఎలా అన్నట్టుగా కంగారుపడుతూ ఆ ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇలా ఎన్నోసార్లు ప్రేక్షకులు మోసపోవడం కూడా జరిగింది. దీంతో సదరు కార్యక్రమ నిర్వాహకుల పైన కూడా ప్రేక్షకుల సైతం అప్పుడప్పుడు మండిపడుతున్న సందర్భాలు చాలానే ఉంటాయి.

అయితే సుమ మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండేది. కార్యక్రమాలకు రేటింగ్ తీసుకురావడం కోసం సుమ కూడా ఇప్పుడు ఇలాంటివి చేయకుండా తప్పలేదు. సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించి గెస్టుల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావడం తీవ్రమైన గొడవ పడ్డారు అన్నట్లుగా ప్రోమోలో చూపించడం జరిగింది.సుమ వారి కోసం పరుగులు పెట్టినట్టుగా ఈ ప్రోమోలో చూపించారు. అయితే ఏం జరిగింది అని ఎపిసోడ్ ప్రారంభమైన సమయంలో చూడగా ఇదంతా కేవలం స్కిట్ కోసమే అన్నట్లుగా చేశారని తేలిపోయింది.

కానీ ఈ ప్రోమోలో ఏముందంటే ఆరియాన , అఖిల్ ఏదో స్కిట్ వేశారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఆరియాన కు రెండు లక్షలు ఇచ్చి తీసుకువచ్చార.. అయితే రెండు లక్షలు ఇచ్చి ఈమెను తీసుకొచ్చారు ఏంటి అంటూ అఖిల్ హేళన చేశారు. దీంతో ఆమె నీకు నేనే ఎక్కువ అంటూ అఖిల్ పరువు మొత్తం తీసింది ఆరియాన. ఇక ఇంతలో తేజస్విని కలుగజేసుకొని ఏదో మాట మాట పెరిగి నువ్వు ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చావు అంటూ కౌంటర్ వేయడంతో నీతో తర్వాత మాట్లాడుతా అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version