మంచు మనోజ్, మౌనికలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మంచు మనోజ్, మౌనికలపై కేసు నమోదు కావడం జరిగింది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడుకు మనోజ్, కోడలు మౌనికపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
ఇక మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే ‘ఎక్స్’ వేదికగా స్పందించారు మంచు మనోజ్. ఇలాంటి నేపథ్యంలోనే.. మోహన్ బాబు ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మంచు మనోజ్ మౌనికలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు ప్రకటన చేశారు. మోహన్ బాబు పిర్యాదు పై మనోజ్, మౌనిక పై కేసు నమోదు అయింది. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడని… మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడని మోహన్‌బాబు వెల్లడించారు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు అని మోహన్ బాబు తెలిపారు.