ఫస్ట్ డే “దేవర” రికార్డు కలెక్షన్లు..!

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం “దేవర”. మరి పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రమోషన్స్ మధ్య రిలీజ్ కి ఈ చిత్రాన్ని తీసుకురాగా.. ఫస్ట్ డేకి చాలా చోట్ల తారక్ భారీ రికార్డులు సెట్ చేసాడు. అలాగే నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా తక్కువ బజ్ తోనే సాలిడ్ ఓపెనింగ్స్ కి దేవర ఇప్పుడు అందుకున్నట్టు తెలుస్తోంది.

దేవర మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.172 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇది మాత్రం సర్ప్రైజింగ్ నెంబర్ అనే చెప్పాలి. కొంచెం మిక్స్డ్ టాక్ లో కూడా దేవర ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం అనేది ఇంట్రెస్టింగ్ అంశమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిగతా రోజుల వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.  ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్  నిర్మాణం వహించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version