జ‌య‌మ్మ పంచాయితీ నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సీనియ‌ర్ యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర లో వ‌స్తున్న సినిమా జ‌య‌మ్మ పంచాయితీ. ఈ సినిమా టీజ‌ర్ ను రెండు వారాల క్రిత‌మే విడుద‌ల చేశారు. తాజా గా ఈ సినిమా నుంచి అదిరిపొయిన అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా లో ని మొద‌టి లిరిక‌ల్ సాంగ్ ను ఈ రోజు విడుద‌ల చేశారు. నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేశారు.

తిప్ప‌గ‌ల‌నా.. అంటూ సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట విడుద‌ల కొద్ది స‌మ‌యం లో నే వేల‌ల్లో వ్యూ వ‌స్తున్నాయి. కాగ ఈ తిప్ప‌గ‌ల‌నా.. అనే పాట ను రోహిత్ పాడాడు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాట‌ను ర‌చించాడు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. కాగ సుమ జ‌య‌మ్మ పంచాయితి సినిమా ను క‌లివార‌పు విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే క‌థ, స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా విజ‌య్ కుమార్ అందించాడు.