ప్రధాని మోదీకి “ఘనా” అత్యున్నత పురస్కారం

-

ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం దక్కింది. ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు ప్రదానం చేశారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ చేతుల మీదుగా సత్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చారు ప్రధాని మోడీ.

PM Modi receives Ghana's national honour 'Officer of the Order of the Star
PM Modi receives Ghana’s national honour ‘Officer of the Order of the Star

మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని మోదీ. ఐదు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు. ఘనాకు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా. రెండు రోజులు ఘనాలోనే పర్యటించనున్నారు ప్రధాని మోదీ. భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు ఇరు దేశాల నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news