శ్రీదేవి మరణించిన ఐదేళ్లకు చిరకాల కోరిక తీర్చిన భర్త.. ఏమిటంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించడం జరిగింది.. టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరు సరసన నటించిన శ్రీదేవి దుబాయిలో బాత్రూంలో కాలు జారి ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే ..అయితే ఈమె చనిపోయి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కావోస్తున్న ఆమె చిరకాల కోరికను తన భర్త బోణికపూర్ తీర్చినట్టుగా తెలుస్తోంది.

1980 వ దశకంలో హీరోయిన్గా తన కెరీర్ మంచి పిక్ లో ఉన్న సమయంలోనే శ్రీదేవి చెన్నై సమీపంలో మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక ఐదు ఎకరాలు పొలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ తన డ్రీమ్ హౌస్ ని కట్టుకోవాలని చాలా ఆశగా ఉండేదట. అయితే ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో తన భార్య చిరకాల కోరికను సైతం బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ శ్రీదేవి భర్త ఇన్ని రోజులకు నెరవేర్చినట్టుగా తెలుస్తోంది.

తాజాగా గ్రూప్ పార్ట్నర్ షిప్ లో హోటల్ అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది.. ఇది శ్రీదేవి కల ఆమె డ్రీమ్ పూర్తి చేయడానికి రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేపడుతూనే ఉన్నారు.. ఫైనల్ గా బీచ్ హౌస్ ని పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది అంటు బోణీ కపూర్ తెలియజేసినట్టు తెలుస్తోంది. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news