కీర్తి సురేష్ ” పెంగ్విన్ ” సినిమా నుండి జూన్ 8 న టీజర్ ..19 రిలీజ్ ..!

-

నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలతో కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. అయితే మహానటి సావిత్రి జీవిత కథ తో తెరకెక్కిన మహానటి సినిమా ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి కీర్తి సురేష్ కి తెలుగు తమిళ సినిమాలలో క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.

 

ఇక కోలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ అన్నాత్తే లో కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగు తమిళం లో కలిపి మొత్తం 6 సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తను నటించిన ద్విభాషా చిత్రం పెంగ్విన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ఇంతకముందే ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం. అంతేకాదు జూన్ 8 న ఈ సినిమా నుండి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసి తెలియ చేశారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version