‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ (వాల్మీకి) ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. వ‌రుణ్ కెరీర్ బెస్ట్‌

-

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ కు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవే. ఈ హీరో గెటప్ కు మంచి రెస్పాన్స్ రావడం, హరీష్ శంకర్ పై జనాలకు కాస్త నమ్మకం ఉండడంతో.. గద్దలకొండ గణేష్ మొదటి రోజు మెరిసింది. మ‌రోవైపు త‌న పెద‌నాన్న న‌టించిన సైరా త్వ‌ర‌లోనే రిలీజ్ అవుతున్నా ఆ సినిమా విడుదల కి రెండు వారాల ముందు గద్దల కొండ గణేశ్ అంటూ వచ్చేశాడు వరుణ్ తేజ్.

కోలీవుడ్ హిట్ సినిమా జిగ‌ర్తాండాకు రీమేక్‌గా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ ఊర‌మాస్ యాక్టింగ్‌, హ‌రీష్ శంక‌ర్ టేకింగ్ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ కేవలం 22 కోట్లు .. దాదాపు 25 కోట్ల వరకూ ఈ సినిమా బిజినెస్ చేయ‌గా… తొలి రోజే రూ.7 కోట్ల షేర్ తెచ్చుకుంది.. అంటే సైరా వ‌చ్చే వ‌ర‌కు పోటీ లేక‌పోవ‌డంతో గ‌ద్ద‌ల‌కొండ మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌నుంది.

Gaddala Konda Ganesh Movie First Day Collections

గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి) ఫ‌స్ట్ డే షేర్ (రూ.కోట్ల‌లో) 
నైజాం – 1.86

సీడెడ్ – 0.81

వైజాగ్ – 0.70

ఈస్ట్ – 0.54

వెస్ట్ – 0.58

కృష్ణా – 0.41

గుంటూరు – 0.71

నెల్లూరు – 0.20
———————————–
ఏపీ+తెలంగాణ = 5.81 కోట్లు
———————————–

రెస్టాఫ్ ఇండియా – 0.42

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 0.58
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే షేర్ = 6.81
————————————-

Read more RELATED
Recommended to you

Exit mobile version