ఎటైనా వెళ్లిపోవాలని ఉంది.. ‘ధృవ నక్షత్రం’ వాయిదాపై గౌతమ్‌ మేనన్ ఆవేదన

-

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో గౌతమ్‌ మేనన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధృవ నక్షత్రం. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇలా పోస్ట్పోన్ అవ్వడంపై తాజాగా దర్శకుడు గౌతమ్ స్పందించాడు. ఇంత మంచి సినిమా తరచూ వాయిదా పడటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా హృదయవిదారకంగా ఉందని, చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదని వాపోయారు.

తన కుటుంబం కూడా ఆందోళన చెందుతోందని, తన భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోందని చెప్పారు. తనకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోందని, కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ‘మార్చి1న  ‘జాషువా’ విడుదల కానుంది. ముందే ‘ధృవ నక్షత్రం’ విడుదల చేయాలని భావించాం. అది కుదరలేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. 2016లోనే ‘ధృవ నక్షత్రం’ షూటింగ్ జరిగింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఆర్థిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news