అక్రమ మైనింగ్ పై ఏపీ హై కోర్టు ఆగ్రహం..!

-

అక్రమ మైనింగ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. గుంటూరు జిల్లా చేబ్రోలు లో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మెండెం ప్రభుదాస్ అనే వ్యక్తి.. అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇచ్చిన పట్టాభూముల్లో మైనింగ్ చేస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు.

పేదలకు ఇచ్చిన భూముల్లో మైనింగ్ చేయడం ఏంటి..? అని హైకోర్టు ప్రశ్నించింది.  అయితే వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కోరారు ప్రభుత్వం తరుపు న్యాయవాది.. కానీ, రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై స్థానిక జ్యుడిషియల్ అధికారులతో తిరిగి విచారణ చేపడతామని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నివేదికలో తేడా ఉంటే మైనింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటాని వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news