అమీర్‌ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా?

-

జెనీలియా అనగానే ముందుగా బొమ్మరిల్లు సినిమా పేరు గుర్తుకొస్తుంది. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ జెనీలియా ని ఎలివేట్ చేస్తూ సినిమాని తెరకెక్కించారు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో తన అంద చందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

Genelia Deshmukh will reportedly star alongside Aamir Khan in Sitaare Zameen Par
Genelia Deshmukh will reportedly star alongside Aamir Khan in Sitaare Zameen Par

అయితే.. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ జెనీలియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ కొత్త చిత్రం సితారే జమీన్ పర్ లో జెనీలియా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక ఆమె కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. కాగా, ఈ ఏడాది వేద్ సినిమాతో జెనీలియా రీఎంట్రీ ఇచ్చారు. తెలుగు మజిలీ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news