Get Ready : సాయంత్రం 7.02 గంటలకు “గాడ్ ఫాదర్” ఫస్ట్ సింగిల్

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్.

ఈ టీజర్ లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతిి తెలిసిందే. ఈ చిత్రంలో నయన్ ” సత్యప్రియ జై దేవ్” గా పరిచయం చేశారు. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ ను ప్రకటించారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్‌ కానుంది. “మార్ మార్ టక్కర్ మార్” అంటూ సాగే మాస్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.