మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్…!

-

తెలుగులో చిరంజీవి సినిమా వస్తుంది అంటే చాలు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా అనగానే పనులు మానుకుని కూడా చూసే పరిస్థితి మన తెలుగులో ఉంటుంది. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే హీరో చిరంజీవి. వయసు మీద పడుతున్నా సరే ఆయన సినిమాను చూడటానికి ఇప్పటికి ప్రేక్షకులు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆయన సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది.

ఆయన సినిమా కోసం టాలీవుడ్ లో ఉన్న నటులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. 80 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఇప్పటికే లీక్ అయింది కూడా.

అయితే సినిమా వచ్చే తేదీ విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఉగాది సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news