పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో రావల్సిన సినిమా కూడా అటకెక్కింది అని చెప్పవచ్చు. కానీ అభిమానులు మాత్రం తప్పకుండా వీరి కాంబినేషన్లో సినిమా రావాలని కోరుకుంటున్న నేపధ్యంలో విజయేంద్రప్రసాద్ వీరిద్దరి కాంబినేషన్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.ఆయన అధికారికంగా ప్రకటిస్తూ త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని కూడా చెప్పడం హర్షదాయకం. రాజమౌళి సినిమా అంటే వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇంతటి రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ బాంబు పేలే అవకాశం పక్కాగా ఉంటుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త .. గురితప్పని రాజమౌళి కాంబో..!!
-