మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. కొత్త పోస్టర్ వదిలిన గుంటూరు కారం టీమ్

-

టాలీవుడ్​ సూపర్​ స్టార్ మహేశ్​ బాబు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ప్రముఖ సినీ, రాజకీయ ప్రముకులు, అభిమానులు మహేశ్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఈ రాజకుమారుడి బర్త్ డే విషెస్​తోనే ఓవర్ ఫ్లో అవుతోంది. #HBDMaheshbabu ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు జన్మదినం పురస్కరించుకుని ‘గుంటూరు కారం’ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

బుధవారం​ అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం నుంచి మహేశ్​ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మహేశ్​ లుంగీ కట్టుకుని మాస్​ లుక్​లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. ఓ చేత్తో స్టైలిష్​గా చుట్టా కాలుస్తూ కనిపించారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్​ ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన శ్రీలీల నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version